పెళ్లి మోసం: పోలీసుల ఎదుటకు హీరో ఆర్య

0
48
Spread the love

చెన్నె: తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని శ్రీలంక యువతి ప్రముఖ నటుడు ఆర్యపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తమిళనాడులోని చెన్నెలో కమిషనర్‌ ఎదుట ఆర్య మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో విచారణకు హాజరయ్యాడు. శ్రీలంకకు చెందిన యువతి విద్జా జర్మనీలో ఉంటోంది. ఆర్య తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రూ.70 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆమె జర్మనీలో ఉండే ఆన్‌లైన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతోపాటు ఆర్యతో చేసిన చాటింగ్‌ అంటూ కొన్ని స్క్రీన్‌షాట్‌ ఫొటోలు కూడా విడుదల చేసింది. చెన్నెలో ఆర్యను మూడు గంటల పాటు విచారించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. ఆగస్టు 17వ తేదీకి విచారణ వాయిదా వేస్తూనే ఈ కేసుపై మరిన్ని విషయాలు తెలుసుకోవాలని పోలీసులకు ఆదేశించడంతో ఆర్యను విచారించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here