సినీ నిర్మాతలు చేస్తోన్న రెమ్యునరేషన్ ప్రయత్నాలపై అశ్వనీదత్ వ్యాఖ్యలు తీవ్ర కలకలం..?

0
73
Spread the love

చిత్ర పరిశ్రమలో నిర్మాత అశ్వనీదత్ గురించి తెలియని వారుండరు. పాతికేళ్ల వయసు కూడా లేని సమయంలోనే అశ్వనీదత్ ఎన్టీఆర్ తో భారీ సినిమా తీసి, సినిమా ఇండస్ట్రీని షేక్ చేశాడు. అగ్ర హీరోలందరితో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించి సక్సెస్ అయ్యారు. తాజాగా సినిమాల నిర్మాణ వ్యయం తగ్గించాలంటూ నిర్మాతలు చేస్తోన్న ప్రయత్నాలపై అశ్వనీదత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి.

వైజయంతీ మూవీవ్ అధినేత అశ్వనీదత్ ప్రొడ్యూసర్స్ గిల్ట్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సినిమా టికెట్ ధరలు పెంచాలని సిఎం వద్దకు వెళ్లి మరీ సాధించుకున్న నిర్మాతలు, నేడు సినిమా నిర్మాణ వ్యయం తగ్గించాలని చేస్తున్న ప్రయత్నాలను ఆయన తప్పుపట్టారు. సినిమా టికెట్ రేట్లు పెంచడంతోపాటు, క్యాంటీన్లో రేట్లు దారుణంగా ఉన్నాయని, జనం సినిమా థియేటర్లకు రావాలంటే భయపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. జనం థియేటర్లకు ఫ్యామిలీతో రావాలంటే భయపడే రోజులొచ్చాయన్నారు. ధరలు ఇలా పెంచుకుంటూ పోతే సినిమా థియేటర్లకు జనాలకు తీసుకురావడం చాలా కష్టమని అశ్వనీదత్ అభిప్రాయపడ్డారు..గతంలో నిర్మాతల మండలి ఉండేదని ఏ సమస్య వచ్చినా, ఆనాటి అగ్రహీరోలతో కూడా చర్చించి పరిష్కరించుకునే వారమని అశ్వనీదత్ అభిప్రాయపడ్డారు. నేడు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఏర్పడిందని, ఎవరి దారి వారిదేనని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకరు సినిమా టికెట్ ధరలు పెంచాలంటారు, సినిమా టికెట్ ధరలు పెంచుకుంటే పోతే జనం థియేటర్లకు రారని, అందరూ కలసి సినిమా ఇండస్ట్రీని బ్రష్టు పట్టిచారని అశ్వనీదత్ వ్యాఖ్యానించారు. హీరోల రెమ్యునరేషన్ తగ్గించాలనడంలో అర్థం లేదన్నారు. హీరోల మార్కెట్ ను బట్టే రెమ్యునరేషన్ ఉంటుందని అశ్వనీదత్ అభిప్రాయపడ్డారు. మార్కెట్ లేకపోతే హీరోలకు కోట్లు కోట్లు ఇవ్వరు కదా అని ఆయన ప్రశ్నించారు…

ఫ్యామిలీతో సినిమాలు చూసే రోజులు ఎప్పుడో పోయాయని అశ్వనీదత్ వ్యాఖ్యానించారు. ఒకటి రెండు రోజులు ఫ్యాన్స్ అధిక ధరలు పెట్టి టిక్కెట్లు కొంటున్నారని, తరవాత థియేటర్లలో ఎవరూ ఉండటం లేదని ఆయన అన్నారు. సినిమా టికెట్ ధరలు ప్రేక్షకులకు అందుబాటులో ఉంటేనే సినిమాలు థియేటర్లలో వంద రోజులు ఆడతాయని అశ్వనీదత్ అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా సీనియర్ నిర్మాత అశ్వనీదత్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయనడంతో సందేహం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here