పాపులర్‌ వీజే, నటుడు ఆనంద కణ్ణన్ క్యాన్స‌ర్ తో కన్నుమూత

0
74
Spread the love

సింగపూర్‌-తమిళియన్‌ అయిన ఆనంద.. 90వ దశకంలో కోలీవుడ్‌ ఆడియొన్స్‌కు ఫేవరెట్‌ నటుడైప ప్రముఖ యాంకర్‌, సినీ నటుడు ఆనంద కణ్ణన్‌ క్యాన్సర్‌తో కన్నుమూశారు. ముఖ్యంగా సన్‌ టీవీ సిరీస్‌ సింధ్‌బాద్‌లో లీడ్‌ రోల్‌ ద్వారా పిల్లలకు, యువతకు బాగా కనెక్ట్‌ అయ్యాడు. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆనంద.. ఆగష్టు 16న కన్నుమూశారు. 48 ఏళ్ల వయసులో క్యాన్సర్‌ చికిత్స తీసుకుంటూ.. ఆయన నవ్వుతూ పలు కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం.

వారం క్రితం హఠాత్తుగా ఆరోగ్యం తిరగబడడంతో ఆయన్ని చెన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ విషయం తెలియగానే యావత్‌ కోలీవుడ్‌ దిగ్‌భ్రాంతికి లోనైంది. క్రియేటర్‌గా, నటుడిగా 30 ఏళ్ల పాటు తమిళ ఆడియొన్స్‌ను ఆయన అలరించాడు. ఏకేటీ థియేటర్స్‌ను ఏర్పాటుచేసి.. వర్క్‌షాప్స్‌తో రూరల్‌ కల్చర్‌ ద్వారా వర‍్ధమాన నటులెందరినో ప్రోత్సహించారు.

సింగపూర్‌లో వసంతం టీవీ ద్వారా వీజేగా కెరీర్‌ ప్రారంభించిన ఆనంద.. తర్వాత చెన్నైలో స్థిరపడ్డాడు. సన్‌ మ్యూజిక్‌ తో పాటు సన్‌ టీవీలో సీరియళ్ల ద్వారా ఆడియెన్స్‌ను అలరించాడు. ‘సరోజ, అదిసయ ఉల్గం’ చిత్రాల్లో ఆయన నటించగా.. మరో రెండు చిత్రాలు రిలీజ్‌కు నోచుకోలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here