రేవంత్‌ రెడ్డి గృహనిర్బంధం

0
76
Spread the love

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా కోకాపేటలో ప్రభుత్వం వేలం వేసిన భూముల సందర్శన, ధర్నాకు కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. భూముల సందర్శనకు కాంగ్రెస్‌ నేతలు, శ్రేణులు వెళ్లకుండా అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచే రేవంత్ ఇంటి వద్ద పోలీసులు మకాం వేశారు. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు.

మరోవైపు కోకాపేట భూముల వద్దకు మాజీ ఉపముఖ్యమంత్రి, పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ దామోదర రాజనర్సింహ, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్‌ గౌడ్‌, రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు నరసింహారెడ్డి తదితరులు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వారిని కూడా పోలీసుల అడ్డుకునే అవకాశముంది. ఇటీవల జరిగిన కోకాపేట భూముల వేలంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తోంది. దీనిలో భాగంగానే ఆ భూముల సందర్శనకు పిలుపునిచ్చింది.

ఇది నియంతృత్వానికి పరాకాష్ఠ: మల్లు రవి

పార్లమెంట్‌లో కోకాపేట భూముల అవినీతిని ఎండగడతారనే భయంతోనే కాంగ్రెస్‌ నేతలను అడ్డుకుంటున్నారని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు. ఇది అప్రజాస్వామికమని.. ఇంత దుర్మార్గం ఎక్కడా చూడలేదన్నారు. ఈ నియంత పాలనకు, అవినీతి పాలకులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here