అద‌ర‌గొడుతున్న Flipkart Offers… రూ.9,999 ఫోన్ రూ.539కే ! ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ డీల్!

0
24
Spread the love

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఇంకొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న నేప‌థ్యంలో.. చాలా ఫోన్లపై భారీ తగ్గింపు ఆఫర్లు లభించనునాయి. బిగ్ బిలియన్ డేస్ సేల్ (Big Billion Days) వరకు ఆగకుండానే ఇప్పుడు ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారికి కూడా ఒక అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. మనం ఇప్పుడు రెడ్‌మి ఫోన్‌పై ఎలాంటి డీల్ అందుబాటులో ఉందో తెలుసుకోబోతున్నాం.

రెడ్‌మి 9ఐ స్పోర్ట్ స్మార్ట్‌ఫోన్‌పై పలు రకాల ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ ధర రూ. 9999గా ఉంది. దీన్ని బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ. 3 వేల డిస్కౌంట్‌తో కొనుగోలు చేయొచ్చు. అంటే ఇప్పుడు ఫోన్ ధర రూ. 6,999కు తగ్గుతుంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు అదనంగా 10 శాతం తగ్గింపు అందుబాటులో ఉంటుంది. దీంతో వీరికి మరింత తక్కువకే ఈ ఫోన్ లభిస్తుంది.

ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు చూస్తే ఈ ఫోన్ ధర రూ. 7,999గా ఉంది. అంటే ఫోన్ రేటు రూ. 9,999తో పోలిస్తే ఇప్పుడు కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 2 వేల తగ్గింపు ఉంది. అలాగే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై రూ. 1500 తగ్గింపు వస్తుంది. లేదంటే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై కూడా ఇదే ఆఫర్ ఉంది. ఇంకా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఇలాంటి తగ్గింపు ఆఫర్‌నే పొందొచ్చు. అయితే ఈ కార్డులపై ఆఫర్లు పొందాలంటే మాత్రం కనీస ట్రాన్సాక్షన్ విలువ రూ. 5 వేలు ఉండాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here