Singer Suneetha కొత్త జర్నీ.. ఎవ‌రి కోస‌మో తెలుసా?

0
79
Spread the love

మంచి గాయనిగా, బెస్ట్ అనువాద కళాకారిణిగా రాణించిన‌ సునీత త్వరలో డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగు పెట్టనున్నట్లు స‌నీవ‌ర్గాల సమాచారం. రామ్‌ వీరపనేనిని రెండవ వివాహం చేసుకుని, వ్యక్తిగతంగా కొత్త ప్రయాణం మొదలు పెట్టారామె. ఇప్పుడు వృత్తిపరంగా ఓ కొత్త ప్రయాణం ఆరంభించనున్నారని టాక్‌. రామ్‌ డిజిటల్‌ రంగంలో ఉంటూ Web series, Shows చేస్తుంటారు. సునీతతో ఒక వెబ్‌ సిరీస్‌ నిర్మించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారట. గతంలో సినిమా శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన ‘అనామిక’లో ప్రొమోషనల్‌ సాంగ్‌లో కనిపించారు. ఆ తర్వాత వెండితెరపై కనిపించలేదు. అవకాశాలు వచ్చినా చేయని సునీత ఈ వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు సుముఖంగా ఉన్నారట. అయితే నటిగా కాదు.. ఈ సిరీస్‌ నిర్మాణ వ్యవహారాలు చూసుకోనున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి.. సునీత కొత్త జర్నీ నటనవైపా? ప్రొడక్షన్‌ వైపా? వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here