భారత్ ఈ ఏడాదిలో మంచి జోరు చూపిస్తుంది. వరుస విజయాలు సాధిస్తూ క్రికెట్ ప్రియులని అలరిస్తుంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతుండగా, తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ గెలవగా, మిగతా రెండు మ్యాచ్‌లలో టీమిండియా విజయం సాధించింది.ఇక నేటి నుండి కీలకమైన నాలుగో టెస్ట్ జరగనుంది. రాంచీలో జరిగే ఈ మ్యాచ్‌లో టీండియా విజయం సాధిస్తే సిరీస్ వారి వశం అవుతుంది. అయితే నాలుగో టెస్ట్‌లో ఏయే ఆటగాళ్లు జట్టులోకి రానున్నారు, ఎవరికి ఉద్వాసన పలుకుతారు అనేది ఆసక్తికరంగా మారింది. రాంచీ మ్యాచ్‌లో భారత స్టార్ క్రికెటర్లలో ఒకరు తిరిగి జట్టులోకి వచ్చే అవకాశముందని తెలుస్తుండగా, కొత్త ప్రేయర్‌ని కూడా తీసుకుంటారని టాక్ నడుస్తుంది.
ప్రస్తుతానికి భారత టాప్ ఆర్డర్ చాలా పటిష్టంగానే ఉందని చెప్పాలి. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఇద్దరు కూడా మంచి ఫామ్‌లో ఉండడంతో ఓపెనింగ్‌లో ఎలాంటి సమస్య లేదు. ఒక ఫస్ట్ డౌన్‌లో శుభమన్ గిల్ కూడా బాగానే ఆడుతున్నాడు. ఇక ఆ తర్వాత రజత్ పాటిదార్ 4వ ప్లేస్ లో ఆడుతుండగా, అతనికి రెండు మ్యాచ్‌లలో ఆడే అవకాశం కల్పించారు. కాని అవకాశాన్ని పెద్దగా వినియోగించుకోలేదు. దీంతో అతని స్థానంలో పడిక్కల్‌కి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఇక ఐదో స్థానంలో సర్ఫరాజ్ అద్భుతంగా ఆడుతున్నాడు. కాబట్టి అతనిని ఆ స్థానంలో కొనసాగించే అవకాశం ఉంది. ఇక ఆరో స్థానంలో రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.
మరోవైపు కేఎల్ రాహుల్ రీఎంట్రీ ఇస్తున్నాడని టాక్ వినిపిస్తుండగా, ఎవరిని తప్పిస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. ధృవ్ జురెల్‌ను వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా నాలుగో టెస్ట్‌లో కొనసాగుతున్నాడు. రాంచీ పిచ్ స్పిన్నర్స్‌కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. జడేజా, అక్షర్‌లతో పాటు రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ వంటి నలుగురు స్పిన్నర్లను రంగంలోకి దించే అవకాశముంది. జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి లభించింది కాబట్టి పేసర్లయిన ముఖేష్ కుమార్ , ఆకాష్ దీప్ ,మహ్మద్ సిరాజ్ లలో ఒక్కరికే ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. మరి ఈ మ్యాచ్‌లో భారత్ ఎలాంటి ప్రయోగాలు చేస్తుందో మరి కొద్ది నిమిషాలలో తెలియనుంది.