SS Rajamouli: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌పై దర్శకధీరుడి అసహనం.. Twit Viral

0
81
Spread the love

ఎస్‌.ఎస్‌.రాజమౌళి గురించి ఇప్పుడు ప్రత్యేకమైన పరిచయం ఎవరికీ అక్కర్లేదు. ఈ పాన్‌ ఇండియా డైరెక్టర్‌ వివాదాలకు దూరంగా ఉంటారు. తన పని తాను చేసుకుంటూ వెళ్లడమే ఆయనకు తెలుసు. అలాంటి ఈ స్టార్‌ డైరెక్టర్‌ ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని పరిస్థితిపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాను. ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ కోసం దరఖాస్తులు ఇచ్చి వాటిలో తగిన సమాచారాన్ని రాసి ఇవ్వమన్నారు. ఆ పత్రాలు నింపడం కోసం కొంతమంది ప్రయాణికులు గోడలకు ఆనుకుని.. మరి కొంతమంది నేలపైనే కూర్చొని వాటిని పూర్తి చేసి ఇచ్చారు. అక్కడ పరిస్థితి చూడడానికి ఏమీ బాలేదు. ఇటువంటి వాటి కోసం చిన్న టేబులైనా ఏర్పాటు చేయాల్సింది. ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు వచ్చే ద్వారం వద్ద ఎన్నో వీధి కుక్కలు ఉన్నాయి. ఇలాంటివి చూస్తే విదేశీయులకు మన దేశంపై ఎలాంటి భావన కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. దయచేసి వీటిపై దృష్టి సారించండి ’అని రాజమౌళి ట్వీట్‌ చేశారు. మరి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ రాజమౌళి చేసిన సూచనలపై దృష్టి సారించి తగు చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here