క్యాష్ ఒక్క ఎపిసోడ్‌ కి సుమ పారితోషికం ఎంతో తెలుసా?

0
24
Spread the love

ఈటీవీ లో సుదీర్ఘ కాలంగా ప్రసారం అవుతున్న క్యాష్ కార్యక్రమం కు భారీ సంఖ్య‌లో అభిమానులు ఉన్నారు. ఇన్ని సంవత్సరాలుగా ఒక రియాల్టీ షో కొనసాగడం కొనసాగడం… అది సుమ యాంకరింగ్ వల్లే. కేవలం సుమ ఉండడం కారణంగానే తాము క్యాష్ కార్యక్రమాన్ని చూస్తున్నాం అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వారం కూడా సెలబ్రిటీలను తీసుకు వచ్చి వారితో ఆటలు ఆడిపిస్తూ ఎంటర్టైన్మెంట్ ని పండిస్తున్న క్యాష్ కార్యక్రమం కోసం సుమ చాలా కష్టపడుతుంది. ఎన్నో డైలాగులను గుర్తు పెట్టుకుంటూ వచ్చిన కంటెస్టెంట్స్ ని మేనేజ్ చేస్తూ ప్రతి ఒక్క విషయంలో శ్రద్ధ తీసుకుంటుంది. కనుకనే ఈ స్థాయిలో రేటింగ్ వ‌స్తోంది.

సుమ‌కు ఈ క్యాష్ ఒక్క ఎపిసోడ్ కు గాను సుమ 5 లక్షల రూపాయల పారితోషికం తీసుకుంటుంద‌ని బుల్లితెర వర్గాల టాక్. ఐదు లక్షలతో పాటు తన స్టాఫ్ ఖర్చులు అదనం. అవి ఒక 50 వేల రూపాయల వరకు అవుతాయి. మొత్తంగా ఐదున్నర లక్ష ఎపిసోడ్ కు సుమ తీసుకుంటుంద‌ని ఎంట‌ర్ టైన్ మెంట్ వ‌ర్గాల మాట‌. సుమ క్యాష్ కార్యక్రమం మొదట్లో ఒక్క ఎపిసోడ్ కి 50 వేల నుండి 70 వేల రూపాయల పారితోషకం తీసుకునేదట, కానీ ఇప్పుడు ఆమె పారితోషికం ఎన్ని రెట్లు పెరిగిందో మనం చూస్తూనే ఉన్నాం.

సుమ‌కు క్యాష్‌ కార్యక్రమంతో ఒక అనుబంధం ఉంది. తనను యాంకర్ గా నిలబెట్టి ఎంతో గుర్తింపును తెచ్చి పెట్టింది కనుక మల్లెమాల,ఈటీవీ ని వదిలి ఆమె వెళ్లదు. అందుకే క్యాష్ కార్యక్రమం ఆమె రెగ్యులర్ గా చేస్తూనే ఉంటుంది. ఆమె చేయడం వల్ల ప్రేక్షకులు రెగ్యులర్ గా చూస్తూనే ఉంటారు. కనుక మరో 10 సంవత్సరాలు అయినా క్యాష్ కార్యక్రమం వస్తూనే ఉంటది.. ప్రేక్షకులు చూస్తూనే ఉంటారు. యాంకర్ గా సుమ కొనసాగుతూనే ఉంటుంది. సుమ ఎప్పుడైతే చెయ్యలేను అంటూ క్యాష్ కార్యక్రమాన్ని వదిలేస్తుందో అప్పటి వరకు మల్లెమాల వారు క్యాష్ కార్యక్రమాన్ని చేస్తారు. ఈటీవీ వారు ప్రసారం చేస్తారు అనేది బుల్లితెర వర్గాల టాక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here