Home క్రీడ‌లు సన్‌రైజర్స్‌ బౌలర్‌ Sandeep Sharma ప్రేమ వివాహం

సన్‌రైజర్స్‌ బౌలర్‌ Sandeep Sharma ప్రేమ వివాహం

0
Spread the love

Hyderabad: తన చిన్ననాటి స్నేహితురాలు తాషా సాత్విక్‌ను సన్‌రైజర్స్‌ హైదరబాద్‌ బౌలర్‌ సందీప్‌ శర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ సందర్భంగా సన్‌రైజర్స్‌ యాజమాన్యం సందీప్‌కు ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపింది. పెళ్లి ఫోటోను షేర్‌ చేస్తూ.. ”ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్యామిలీకి పెళ్లి కళ వచ్చింది. కంగ్రాట్స్‌ మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ సందీప్‌ శర్మ.. మీ దాంపత్య జీవితం సంతోషంగా సాగాలని కోరుకుంటున్నాం” అంటూ ట్వీట్‌ చేసింది. తాషా సాత్విక్‌ వృత్తిరిత్యా ఫ్యాషన్‌,నగల డిజైనర్‌గా పనిచేస్తున్నారు. 2018లోనే వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్‌ అయినప్పటికీ.. కరోనా కారణంగా వీరి పెళ్లిని వాయిదా వేసుకున్నారు. ఈ సందర్భంగా సందీప్‌ శర్మకు అభిమానులు ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version