బాలయ్యతో తలపడనున్న తమిళ విలక్షణ నటుడు

0
64
Spread the love

Nandamuri Balakrishna కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఎన్‌బీకే107 అనే వర్కింగ్‌ టైటిల్‌తో బాలకృష్ణ పుట్టిన రోజు అధికారిక ప్రకటన వెలువడింది. ఇందులో ఇప్పటికే బాలయ్య సరసన మెహ్రీన్‌ను ఓకే చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ మూవీలో మెయిన్‌ విలన్‌ పాత్ర కూడా బయటకు వచ్చింది. యాక్షన్, ఎమోషనల్‌తో కూడిన పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌తో వస్తున్న చిత్రమిది. అందుకే ఇందులో బాలయ్యతో తలపడేందు పవర్‌ ఫుల్‌ విలన్‌ క్యారెక్టర్‌ను రూపొందించాడు డైరెక్టర్‌. ఇందుకోసం గోపీచంద్ మలినేని తమిళ స్టార్‌ హీరో విజయ్ సేతుపతి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

తమిళంలో విజయ్ Sethupathi కి విలక్షణ నటుడిగా మంచి క్రేజ్ ఉంది. ఇక ఇటీవల కాలంలో తెలుగులోను ఆయన బాగా పాప్యులర్ అయ్యాడు.ప్రస్తుతం విజయ్‌కు ఉన్న విలనిజం క్రేజ్‌ దృష్ట్యా దర్శకుడు ఈ మూవీలో ఆయనను విలన్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ఎస్‌ఎస్‌ తమన్‌ స్వరాలు సమకుర్చనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here