అన్నకు రాఖీ కట్టి వచ్చిన రెండు గంటలకే …సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఉష అనుమానాస్పద మృతి

0
104
Spread the love

విజయవాడ: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఉష అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. తమ కుమార్తె ఉషను అత్తింటివారే చంపేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిన్న రాఖీ పండగ కావడంతో సోదరుడు సూర్యనారాయణ ఇంటికి వెళ్లి రాఖీ కట్టింది. అనంతరం తన ఇంటికి వెళ్లిన ఉషా.. రెండు గంటల తర్వాత చనిపోయిందని సోదరుడికి సమాచారం అందింది. అత్తింటి వారే ఉషా మరణానికి కారణమని బంధువుల ఆరోపిస్తున్నారు. దీంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఫణి అనే వ్యక్తిని ఉషా ప్రేమ వివాహం చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here