అసభ్య పదజాలంతో దూషించిన నెటిజన్.. అనసూయ ఘాటు రిప్లై!

0
332
Spread the love

మూడేళ్ల కిందటి వీడియోను చూసి తనపై అసభ్యకర కామెంట్ చేసిన నెటిజన్‌కు బుల్లితెర యాంకర్ అనసూయ ఘాటు రిప్లై ఇచ్చింది. మూడేళ్ల క్రితం ఓ ఈవెంట్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన అసూసూయ షూటింగ్ సమయంలో అనుకోకుండా కళ్లు తిరిగి పడిపోయింది. దానికి సంబంధించిన కొన్ని ఫొటోలను ఓ నెటిజన్‌ తాజాగా ట్విటర్‌‌లో షేర్‌ చేస్తూ.. ప్రచారం కోసమే అనసూయ అలా కళ్లు తిరిగిపడిపోయిందని కామెంట్‌ చేశాడు. అంతేకాకుండా ఆమెను ఉద్దేశిస్తూ ఓ అసభ్యకర పదాన్ని వాడాడు.

ఈ ట్వీట్ అనసూయకు తీవ్ర అగ్రహం తెప్పించింది. అనసూయ కూడా ఓ అసభ్యకర పదం వాడుతూ ఆ నెటిజన్‌కు అంతే స్థాయిలో రిటార్ట్ ఇచ్చింది. ఇతరులను నిందించడం చాలా సులభం. ఇద్దరు పిల్లలకు తల్లినైన నాకు లో బీపీ ఉంది. 22 గంటలపాటు నిర్విరామంగా షూట్‌లో పాల్గొన్న తర్వాత తెల్లవారుజామున 5.30 గంటలకు నేను అలా కళ్లు తిరిగిపడిపోయాను. ఏం జరిగిందో పూర్తిగా తెలియకుండానే నాపై ఎలా కామెంట్‌ చేస్తావు మిస్టర్‌ ఆదిత్య? అని అనసూయ రిప్లై ఇచ్చింది. అనంతరం నన్ను అసభ్యంగా దూషించాలనే ఉద్దేశంతోనే మూడేళ్ల క్రితం వీడియోను వెలికితీసి ఇలా కామెంట్‌ చేస్తున్నావా? నిన్ను కూడా అసభ్యంగా దూషించడానికి నాకు ఎలాంటి సిగ్గు, భయం లేదు. ఎందుకంటే ముందు నువ్వు మొదలుపెట్టావు. కానీ ఇలా చేస్తున్నందుకు బాధగా ఉంది. ఎందుకంటే నా తల్లిదండ్రులు నన్ను అలా పెంచలేదని అనసూయ సమాధానమిచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here