అగ్నివీరులకు స్వాగతం…నాలుగేళ్ల కష్టపడితే 25 లక్షలు గ్యారంటీ

0
36
Spread the love
FILE PHOTO: Indian soldiers march during the Republic Day parade in New Delhi, India, January 26, 2022. REUTERS/Adnan Abidi

జైకిసాన్, జై జవాన్. ఆరుగాలం శ్రమించి 140 కోట్ల మందికి రైతన్నలు అన్నం పెడుతుంటే, రాత్రి పగలు తేడా లేకుండా దేశ సరిహద్దులు కాచుకుంటూ ప్రజలకు రక్షణ కల్పిస్తున్న వారు జవాన్లు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో జవాన్లుగా చేరేందుకు కేంద్రం తీసుకు వచ్చిన అగ్ని పథ్ పథకం కొంత వివాదానికి దారి తీసినా…. అనేక దేశాల్లో ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉంది. నిరుద్యోగ యువకులకు ఇది నాలుగేళ్ల తాత్కాలిక ఉద్యోగం అనే కొంత అసంతృప్తి ఉన్నా, చిన్న చదువులతో జీవితంలో భరతమాతకు సేవ చేసి, ఆ తరవాత స్థిరపడాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అనిచెప్పవచ్చు. అగ్నిపథ్ పథకం కింద ఇప్పటికే నిరుద్యోగ యువత నుంచి ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం…అగ్నిపథ్ నియామకాల నోటిఫికేషన్ 2022 విడుదలైంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. అగ్నివీర్‌ అర్హతలు, సెలెక్షన్ ప్రాసెస్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎయిర్ ఫోర్స్ అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్ కింద ఎంపికైన IAF అగ్నివీరులు 4 ఏళ్ల పాటు దేశానికి సేవ చేయాలి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ నోటిఫికేషన్‌ ఇప్పటికే విడుదలైంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 24, ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ఆన్‌లైన్ దరఖాస్తులు జూలై 5 సాయంత్రం 5 గంటలకు వరకు చేసుకోవచ్చు. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో agnipathvayu.cdac.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. IAF అగ్నివీర్ ఎంపిక పరీక్ష జూలై 24 న ప్రారంభమవుతుంది.

ఎంపిక విధానం రెండు దశల్లో జరుగుతుంది. ఫేజ్ 1 ఆన్‌లైన్ పరీక్ష. ఫేజ్ 2లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ , ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. Indian Air force Agniveer Recruitment 2022 ఎంపికలో భాగంగా.. మొదట ఫేజ్-1 పరీక్ష ఫలితాలను ప్రకటించిన వెంటనే అభ్యర్థులు స్కోర్ చేసిన మార్కుల ఆధారంగా కట్ ఆఫ్ విడుదల చేసి అందులో షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు కొత్త అడ్మిట్ కార్డ్ పంపుతారు. ఈ అభ్యర్థులు ఫేజ్ 2 పరీక్షల కోసం అర్హత సాధించినట్టు లెక్క. అడ్మిట్ కార్డులను agnipathvayu.cdac.in వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, పీఈటీ అయిన తర్వత చివరగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వీటిలో అర్హత సాధించిన వారు అగ్నివీరులుగా ఎంపిక చేస్తారు.

అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి లేదా 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. డాక్యుమెంట్‌ వెరిఫికేషన్ సమయంలో 10వ తరగతి/మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ తప్పని సరిగా ఉండాలి. ఇంటర్మీడియట్ అంటే 10+2 లేదా తత్సమాన మార్క్ షీట్ లేదా 3 సంవత్సరాల ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తయినవారు, లేదా ఫైనల్ ఇయర్ మార్క్ షీట్ కలిగిన వారు కూడా అర్హులు. లేదా 2 సంవత్సరాల వృత్తి విద్యా కోర్సు మార్క్ షీట్ ఇంగ్లీష్, ఫిజిక్స్ , మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో కూడిన నాన్-వోకేషనల్ కోర్సు చదివిన వారు కూడా అర్హులు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే కనీస అర్హత వయస్సు 17.5 నుండి 23 సంవత్సరాల వరకు ఉండాలి. 29 డిసెంబర్ 1999 తరవాత 29 జూన్ 2005 మధ్య జన్మించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మరి ఇంకెందుకు ఆలస్యం అదృష్ణాన్ని పరీక్షించుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here