తాలిబన్లు సైతం అసూయ చెందేలా వైసీపీ నేతల వ్యవహార శైలి ఉంది — రాగుల ఆనంద్ గౌడ్ తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.

0
133
Spread the love

నారా చంద్రబాబు నాయుడు గారి నివాసం వద్ద వైసీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.

ఆంధ్రప్రదేశ్ ను మరో ఆఫ్ఘనిస్తాన్ గా మార్చేందుకు వైసీపీ నేతలు కంకణం కట్టుకున్నారు.

ముఖ్యమంత్రి పరోక్ష ఆదేశాల తో, పోలీసుల అండదండలతో ప్రతిపక్ష నేత ఇంటిపైకి రాళ్ళ దాడి జరిపించిన ఘటన చూసి పక్క రాష్ట్రాలునివ్వెరపోతున్నాయి.

రాష్ట్రం లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఇనుప రాడ్లు, కర్రలు, రాళ్ళు చేత బట్టిన అల్లరి మూకలకు సాక్షాతూ శాసన సభ్యులే నేతృత్వం వహించడం సిగ్గు చేటు.

ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తే చంపేస్తాం… సంక్షేమ పథకాల డొల్లతనాన్ని విమర్శిస్తే రాళ్లతో దాడి చేస్తాం అన్నట్టు వైసీపీ నేతల తీరు ఉంది.

రెండున్నరేళ్ల వైసీపీ పాలన లో ప్రజలు రెండు రోజులు కూడా ప్రశాంతంగా గడిపిన రోజు లేదు.

చంద్రబాబు గారి ఇంటిపై దాడికి ప్రయత్నిస్తున్న వైసీపీ నాయకులకు, అల్లరి మూకలకు రక్షణ గా వచ్చినట్టు పోలీసుల వ్యవహార శైలి ఉంది.

ప్రభుత్వ వైఫల్యాల పై నిరసనకు టిడిపి నేతలు కొవ్వొత్తులను, ప్లే కార్డు లను వినియోగిస్తుంటే, వైసీపీ నేతలు మాత్రం ఇనుప రాడ్లు, కర్రలు , రాళ్లను ఉపయోగిస్తున్నారు.

పోలీసుల సాక్షిగా పులివెందుల సంస్కృతి రాష్ట్రం పై బలవంతంగా రుద్దే ప్రయత్నం జరుగుతోంది.

చంద్రబాబు గారి నివాసంపై జరిగిన దాడికి నైతిక బాధ్యత వహిస్తూ హోం మంత్రి రాజీనామా చేయాలి. దాడికి నేతృత్వం వహించిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here