విదేశీ భాషలను నేర్చుకోవాలంటే EFLU లో చేరాల్సిందే! అడ్మిష‌న్ల వివ‌రాలు ఇవే!!

0
118
Spread the love

ది ఇంగ్లిష్‌ అండ్‌ ఫారెన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ. దీన్ని 1958లో హైదరాబాద్‌లో ప్రారంభించారు. తొలిగా సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ (సీఐఈ)గా వ్యవహరించేవారు. ఇంగ్లిష్‌ టీచర్‌ ట్రెయినింగ్‌, రిఫ్రెషర్‌ కోర్సులు, ఆయా కోర్సులకు సంబంధించిన ఇంగ్లిష్‌ బుక్స్‌ తర్వాత రేడియో లెసన్స్‌ను అందించేది. ప్ర‌స్తుతం పలు విదేశీ భాషలు, రిసెర్చ్‌ వైపు సంస్థ లక్ష్యాలను నిర్దేశించుకున్నది. 1972లో దీన్ని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ అండ్‌ ఫారెన్‌ లాంగ్వేజెస్‌ (సీఫెల్‌)గా మార్చారు. 1973లో డీమ్డ్‌ యూనివర్సిటీ హోదా లభించింది. 2006-07లో సెంట్రల్‌ యూనివర్సిటీ హోదాను ప్రభుత్వం ఇచ్చింది. సీఫెల్‌ పేరును ఇఫ్లూగా మార్చారు.

ఇఫ్లూ EFLU

ఇంగ్లిష్‌తోపాటు పది విదేశీ భాషలను ఇఫ్లూ అందిస్తుంది.

ఇఫ్లూ ఆఫర్‌ చేసే భాషలు
ఇంగ్లిష్‌, అరబిక్‌, చైనీస్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, స్పానిష్‌, ఇటాలియన్‌, రష్యన్‌, జపనీస్‌, కొరియన్‌, పర్షియన్‌

క్యాంపస్‌లు
ఇఫ్లూ దేశవ్యాప్తంగా మూడు క్యాంపస్‌లు కలిగి ఉంది. ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. లక్నో, షిల్లాంగ్‌లో క్యాంపస్‌లు ఉన్నాయి.

UG కోర్సులు
బీఏ (ఆనర్స్‌), ఇంగ్లిష్‌, అరబిక్‌, చైనీస్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, జపనీస్‌, కొరియన్‌ తదితరాలు.

PG కోర్సులు
ఎంఏ ఇంగ్లిష్‌, కంప్యూటేషనల్‌ లింగ్విస్టిక్స్‌, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ తదితరాలు.

పీజీ డిప్లొమా కోర్సు
పీజీ డిప్లొమా ఇన్‌ ట్రాన్స్‌లేషన్‌ (పీజీడీటీ)

Teacher education కోర్సులు
పీజీ డిప్లొమా ఇన్‌ టీచింగ్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌, బీఈడీ ఇంగ్లిష్‌, పీజీ డిప్లొమా ఇన్‌ టీచింగ్‌ ఆఫ్‌ అరబిక్‌

Phd Programs
లింగ్విస్టిక్స్‌ అండ్‌ ఫొనెటిక్స్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ఎడ్యుకేషన్‌, ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌, ఇంగ్లిష్‌ లిటరేచర్‌ తదితరాలు

IMPORTANT DATES:

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: ఆగస్టు 31
వెబ్‌సైట్‌: https://www.efluniversity.ac.in

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here