ఒకప్పుడు టాలీవుడ్ హీరోగా ఉన్న ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. బాహుబలి సినిమాతో ఆయన ఖ్యాతి పతాక స్థాయికి చేరింది. బాహుబలి రెండు పార్ట్‌లుగా రాగా, ఆ రెండు పార్ట్‌లలో ప్రభాస్ తన విశ్వరూపం చూపించి అదరహో అనిపించాడు. అతని నటనకి దేశం మొత్తం సలాం చేసింది. ఇక ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు చేశాడు. ఇవి భారీ ఎత్తున విడుదలయ్యాయి. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాలు ప్రేక్షకులని ఏ మాత్రం అలరించలేకపోయాయి. మూడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలు ఫ్లాప్ అయిన కూడా ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. రీసెంట్‌గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ప్రభాస్ స్టామినా ఏంటో నిరూపించింది. ఈ సినిమాతో ప్రభాస్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు.
ప్రభాస్ కెరియర్‌లో కొన్ని సక్సెస్‌లు ఉన్నాయి. కొన్ని ఫ్లాప్స్ ఉన్నాయి. అయితే ముందుగా ఫ్లాప్ టాక్ తెచ్చుకొని ఆ తర్వాత హిట్ అయిన సినిమాల జాబితే చూస్తే ముందుగా బుజ్జిగాడు సినిమా గురించి చెప్పుకోవాలి. ఈ సినిమాకి మొదట మిక్స్‌డ్ టాక్ వచ్చింది. తర్వాత మాత్రం హిట్ టాక్ అందుకుంది ఇక బిల్లా సినిమా ముందుగా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కాని తర్వాత మాత్రం బాగానే ఆడింది. లాంగ్ రన్‌లో మూవీకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇక మిస్టర్ పర్‌ఫెక్ట్ చిత్రం మొదట్లో ఓ వర్గం ప్రేక్షకులనే ఆకట్టుకుంది. కాని రాను రాను ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ ను సాధించింది. ఇక ఇటీవల వచ్చిన సలార్ చిత్రం కూడా మొదట్లో డివైడ్ టాక్ తెచ్చుకున్న తర్వాత మాత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
షారుక్ ఖాన్ నటించిన డంకీ సినిమాకి పోటీగా వచ్చిన సలార్ మూవీ కలెక్షన్ల వర్షం కురిపించింది. సలార్ పార్ట్ 1: సీస్‌పైర్ చిత్రం సుమారుగా 625 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టడం అందరిని ఆశ్చర్యపరచింది.ఇటీవల ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలో విడుదలైన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఓటీటీ గ్లోబల్ చార్ట్‌లో 10వ స్థానం దక్కించుకుంది.ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ రానున్న రోజులలో రాజా సాబ్, కల్కి చిత్రాలతో పలకరించనున్నాడు. అనంతరం స్టార్ డైరెక్టర్స్‌తో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేయనున్నాడు.