Homeఆంధ్రప్రదేశ్జగనన్నే కావాలి.. ఇది ప్రజల కోరిక..!

జగనన్నే కావాలి.. ఇది ప్రజల కోరిక..!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతం ప్రజల సంక్షేమం గురించే ఆలోచిస్తూ ఉంటారు. అందుకు ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాలే సాక్ష్యం. గత ప్రభుత్వం చేయలేని పనులన్నీ ఆయన చేసి చూపించారు. నెలనెలా లబ్ధిదారులకు ఇంటికే డబ్బులు అందేలా చేశారు. జగన్ ప్రభుత్వంలో లబ్ధిపొందినవారంతా ఇప్పుడు మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు.

వైఎస్‌ జగన్‌ ఈ రోజు అక్టోబర్ – డిసెంబర్‌ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,132 జంటలకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోపా కింద రూ.78.83 కోట్లు విడుదల చేశారు. వధువుల తల్లిదండ్రుల ఖాతాల్లో ఈ నిధులు జమయ్యాయి. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఏర్పేడు మండలానికి చెందిన లబ్ధిదారు భార్గవి ఏమన్నారో చూస్తే ప్రజల అభిప్రాయం ఏమిటో అర్థమవుతుంది. ఆమె ఏమన్నారో ఈ కింద చూద్దాం.

“అన్నా, మాది నిరుపేద కుటుంబం, మాలాంటి నిరుపేద కుటుంబంలో ఆడపిల్లకు ఇంత సాయం చేస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు అన్నా, నేను ఎస్సీని.. పెళ్ళి చేయడం అంటే ఈ రోజుల్లో ఎంత భారమో అందరికీ తెలిసిందే, కానీ మీరు నేనున్నా మీకు తోడుగా అనే భరోసా కల్పించారు. మీరు అందరూ చదువుకునేలా చేస్తున్నారు. బాల్యవివాహాలు తగ్గుతున్నాయి.. అక్షరాస్యత పెరుగుతుంది. మీ వల్లే ఇదంతా సాధ్యమవుతుంది. మీరు ప్రవేశపెట్టిన అనేక పథకాల వల్ల పేదలు ఆనందంగా ఉన్నారు. మా కుటుంబంలో మేం చాలా లబ్ధిపొందాం. మాకు పథకాలు అందాయి. మీరు ప్రవేశపెట్టిన వలంటీర్‌ వ్యవస్థ‌, సచివాలయ వ్యవస్థ‌ చాలా ఉపయోగపడుతున్నాయి. నాడు నేడు ద్వారా కార్పొరేట్‌ స్కూల్స్‌కు ధీటుగా గవర్నమెంట్‌ స్కూల్స్‌లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టి చదువులు చెబుతున్నారు. స్కూల్స్‌ రూపురేఖలు మార్చేశారు. పేదల ఇళ్ల‌ల్లో వెలుగులు నింపుతున్నారు. గతంలో రేషన్‌ కోసం ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు ఇంటి ముందుకే అన్నీ వస్తున్నాయి, మళ్ళీ మీరే సీఎంగా రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను, థ్యాంక్యూ అన్నా”. అని ఆమె చెప్పారు.

ఒక్క భార్గవి మాత్రమే కాదు. ఇలాంటి చాలా మంది భార్గవిలు జగన్ ప్రభుత్వంలో లబ్ధి పొందారు. వారంతా కూడా మళ్లీ ముఖ్యమంత్రి జగన్ కావాలని, తమకు మళ్లీ కష్టాలు రాకూడదని కోరుకుంటున్నారు.

RELATED ARTICLES

Most Popular