Homeతెలంగాణవైఎస్ ఫ్యామిలీని హీరోని చేసిన తెలంగాణ అసెంబ్లీ

వైఎస్ ఫ్యామిలీని హీరోని చేసిన తెలంగాణ అసెంబ్లీ

తెలిసో తెలియకో లేకపోతే యాధృచ్చికమో కానీ తెలంగాణ అసెంబ్లీ వైఎస్ ఫ్యామిలీని హీరోని చేసింది. నాలుగు రోజులుగా తెలంగాణ అసెంబ్లీ(telangana assembly) చర్చల్లో చాలాసార్లు వైఎస్ ఫ్యామిలీ(ys family) గురించి పెద్ద చర్చే జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో ఎక్కువగా నీటి ప్రాజెక్టుల పైనే చర్చలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్సార్ గురించి ప్రస్తావన వచ్చింది. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గురించి కూడా పదేపదే ప్రస్తావన వచ్చింది.

ఈ ఇద్దరి గురించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్, భట్టి, శ్రీధర్ బాబు తదితరులు మాటల్లో రాయలసీమ ప్రాజెక్టులపై వైఎస్సార్, జగన్ చిత్తశుద్ది బయటపడింది. బీఆర్ఎస్ సభ్యులు తెలంగాణ ప్రాజెక్టులకు వైఎస్సార్ హయాంలో అన్యాయం జరిగిందన్నారు. కేసీయార్ హయాంలో జగన్ కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి, పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ పథకాన్ని ఎక్కువ నీటి కేటాయింపులు చేయించుకున్నట్లు రేవంత్, మంత్రులు ఆరోపించారు. తెలంగాణ కోణంలో వీళ్ళు వైఎస్, జగన్‌పైన ఆరోపణలు గుప్పించినా ఏపీ కోణంలో కచ్చితంగా వీళ్ళిద్దరు హీరోలుగా ప్రొజెక్టయ్యారు.

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పథకానికి వైఎస్ హయాంలో 44 వేల క్యూసెక్కుల నీటి నిల్వ సామర్థ్యానికి అనుమతి ఉండేదని ఉత్తమ్ చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నీటి నిల్వ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కుల నుండి 90 వేల క్యూసెక్కులకు పెంచినట్లు మండిపడ్డారు. అంటే రాయలసీమలోని సాగు, తాగు నీటి పథకాలకు వైఎస్సార్ ఫ్యామిలీ చేసిన కృషి తెలంగాణ అసెంబ్లీ చర్చల ద్వారా బయటపడింది.

రాయలసీమకు జగన్ ఏమీచేయలేదు తాను చాలా చేశానని ఈ మధ్య చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నారు. అలాంటిది తెలంగాణ అసెంబ్లీలో పొరబాటును కూడా చంద్రబాబు ప్రస్తావన రాలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ ఎంత వరకైనా వెళతాడన్న సందేశాన్ని తెలంగాణ అసెంబ్లీనే ఏపీ జనాలకు పంపినట్లయ్యింది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏమో వైఎస్సార్ పేరు చెప్పి కాంగ్రెస్ మీద దాడిచేశారు. రేవంత్ రెడ్డి, మంత్రులేమో జగన్ పేరు చెప్పి బీఆర్ఎస్ మీద దాడి చేశారు. రెండు వైపుల వాళ్ళు పొరబాటున కూడా చంద్రబాబు ఊసే ఎత్తలేదు. కారణం ఏమిటంటే రాయలసీమ లేదా సీమాంధ్ర ప్రాంతంలో సాగు, తాగునీటికి చంద్రబాబు చేసిందేమీ లేదని తెలంగాణ అసెంబ్లీ బయటపెట్టింది.

RELATED ARTICLES

Most Popular