కేసీయార్ కు సెంటిమెంట్లు చాలా ఎక్కువన్న విషయం తెలిసిందే. పూజలు, యాగాలు, హోమాలు చేయిస్తునే ఉంటారు. ఇపుడు విషయం ఏమిటంటే ఎన్నికలు ఏవైనా సరే కరీంనగర్ జిల్లా నుండే బహిరంగ సభలు నిర్వహించడం సెంటిమెంటు. కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ బహిరంగసభతోనే కేసీయార్ మార్చి 10వ తేదీన పార్లమెంటు ఎన్నికల బహిరంగ సభలో పాల్గొనటం ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారు.మొన్నటి అసెంబ్లీ ఎన్నికల బహిరంగసభలను కూడా హుస్నాబాద్ నుండే ప్రారంభించిన విషయం గుర్తుండే ఉంటుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. అయినా సరే ఏమాత్రం వెనక్కు తగ్గకుండా రాబోయే పార్లమెంటు ఎన్నికల బహిరంగసభలను కూడా హుస్నాబాద్ లేదా కరీంనగర్ నుండే మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యారట. మొన్నటి నల్గొండ బహిరంగసభ జస్ట్ శాంపుల్ మాత్రమే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లోల ఓడిపోయిన రెండురోజే కేసీయార్ బాత్ రూంలో పడటంతో తుంటిఎముక విరిగింది. దానికి ఆపరేషన్ చేసిన డాక్టర్లు ఆరువారాలు విశ్రాంతి అవసరమని చెప్పారు.
డాక్టర్లు చెప్పినట్లుగా విశ్రాంతి తీసుకున్న కేసీయార్ నల్గొండ సభలో పాల్గొన్నారట. అందుకే బహిరంగసభకు కేసీయార్ వీల్ ఛైర్లోనే హాజరయ్యారు. అసలు కేసీయార్ విషయంలో జరుగుతున్న ప్రచారం ఏమిటంటే ఇకనుండి కేసీయార్ పూర్తిగా రెస్ట్ తీసుకుంటారని. అందుకనే పార్టీ వేదికల మీద కూడా పెద్దగా కనబడటంలేదు.పార్టీ తరపున చేస్తున్న పర్యటనల్లో కూడా కేటీయార్, హరీష్ ఎక్కడా పొరబాటున కూడా కేసీయార్ ప్రస్తావన తేవటంలేదు. చాలాకాలం తర్వాత ఫాంహౌజ్ లో కేటీయార్, హరీష్, కవితతో కేసీయార్ చాలాసేపు భేటీ అయినట్లు పార్టీవర్గాలు చెప్పాయి. మేడిగడ్డ కార్యక్రమానికి సంబంధించి మాట్లాడినపుడు కూడా కేటీయార్ ఎక్కడా కేసీయార్ ప్రస్తావన తేలేదు. అందుకనే కేసీయార్ పూర్తిగా రెస్టులోకి వెళిపోతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. అయితే పార్టీవర్గాల సమాచారం ఏమిటంటే పార్లమెంటు ఎన్నికల తర్వాత రెస్టు తీసుకునే అవకాశముందట. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.