Homeఆంధ్రప్రదేశ్చంద్రబాబు పాలన నిజంగా స్వర్ణయుగమేనా?

చంద్రబాబు పాలన నిజంగా స్వర్ణయుగమేనా?

చంద్రబాబునాయుడు రాజకీయ జీవితం మొత్తంలో ప్రత్యర్థులను నేరుగా ఢీకొన్న ఘటనలు ఎక్కడా కనబడదు. ప్రత్యర్థి ఎవరైనా సరే దొంగదెబ్బ తీయటమే చంద్రబాబుకు తెలిసింది. అలాంటి చంద్రబాబు సడెన్‌గా జగన్మోహన్ రెడ్డిని చర్చకు రమ్మని సవాలు విసరటమే ఆశ్చర్యంగా ఉంది. తామిద్దరి పాలనలో ఎవరిది స్వర్ణయుగమో? ఎవరిది రాతియుగపు పాలనో తేల్చుకునేందుకు జగన్‌ను చర్చకు రమ్మని చంద్రబాబు చాలెంజ్ విసిరారు. సినిమా డైలాగులు చెప్పినట్లుగా ఏ అంశంపైనైనా రెడీ అట. వేదిక జగన్ చెప్పినసరే లేకపోతే తనను డిసైడ్ చేయమన్నా చేస్తారట.

సహజ వనరులను దోచేసి, స్కాములు చేసి దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా జగన్ తయారయ్యాడని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో ఏమూల చూసినా వైసీపీ ప్రభుత్వం వల్ల నష్టపోయిన జనాలే కనబడుతారట. ఓటమి భయంతోనే 77 మంది ఎమ్మెల్యేల‌ను మార్చారట. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం తథ్యమని చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు. తన పేరు చెబితే దళితులకు ఇచ్చిన సబ్ ప్లాన్ నిధులు, ఇన్నోవా కార్లు, నిరుద్యోగ భృతి, 11 డీస్సీలతో ఇచ్చిన 1.5 లక్షల టీచర్ ఉద్యోగాలు, రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ, పసుపు కుంకుమ, చంద్రన్నబీమ, పెళ్ళికానుక, రాజధాని అమరావతి, 16 లక్ష్లల కోట్ల పెట్టుబడులు, పది లక్షల ఉద్యోగాలు గుర్తుకొస్తాయని చంద్రబాబు చెప్పారు.

తన హయాంలో జరిగాయని చంద్రబాబు చెప్పినవన్నీ నిజమే అయితే 2019 ఎన్నికల్లో జనాలు ఎందుకంత ఘోరంగా ఓడించారు? నిజంగానే జగన్ గనుక చర్చకు రెడీ అయితే చంద్రబాబు అడ్రస్సుండరు. ఏదో కారణం చెప్పి చర్చ నుండి తప్పుకుంటారు. ఎందుకంటే ప్రత్యర్థిని నేరుగా ఢీకొనేంత సీన్ చంద్రబాబుకు ఎప్పుడూ లేదు.

2014 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, రైతు రుణమాఫీ చేయలేదు, డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చేయకుండా 2019 ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ పేరుతో కొత్త నాటకమాడారు. లక్షల కోట్ల పెట్టుబడులు లేవు, లక్షల్లో ఉద్యాగాలు ఇవ్వలేదు. పెట్టబడులు వచ్చినట్లు, లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చినట్లు ఎల్లో మీడియాలో ప్రచారం చేయించుకున్నారంతే. అమరావతి నిర్మాణం గురించి అందరికీ తెలిసిందే. తన పాలన స్వర్ణయుగమని చెప్పుకోవాల్సింది చంద్రబాబు, ఎల్లో మీడియా కాదు జనాలు. చంద్రబాబుది స్వర్ణయుగమా కాదా అని 2019 ఎన్నికల్లో జనాలు ఇచ్చిన తీర్పే నిదర్శనం.

RELATED ARTICLES

Most Popular