Homeఆంధ్రప్రదేశ్జగన్ – పవన్ మధ్య తేడా ఇదేనా..

జగన్ – పవన్ మధ్య తేడా ఇదేనా..

తాడేపల్లిగూడెం జెండా బహిరంగసభ తర్వాత చాలామందిలో ఒక చర్చ జరుగుతోంది. అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి – పవన్ కల్యాణ్ మధ్య బాడీ ల్యాంగ్వేజ్, మాటల్లో స్పష్టతపైన. ముందు జగన్ విషయాన్ని తీసుకుంటే ముఖ్యమంత్రి చేతల మనిషే కానీ మాటల మనిషికాదు. ఏదన్నా మనసులో ఫిక్సయితే దాన్ని నూరు శాతం రీచ్ అవ్వటానికే ప్రయత్నిస్తారు. బహిరంగసభలు, పార్టీ నేతల సమావేశం, క్యాడర్‌తో మీటింగులు ఏదన్నా తీసుకోండి చెప్పదలచుకున్నది స్పష్టంగా చెప్పేస్తారు. టార్గెట్‌ను చెప్పటంలో మొహమాటం, తడబాటు ఉండదు. కుప్పంలో చంద్రబాబునాయుడును ఓడించాలని ఫిక్సయ్యారు కాబట్టే దానికి తగ్గట్లుగానే యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు.

కుప్పంలో చంద్రబాబు ఓడుతారా గెలుస్తారా అన్నది వేరేసంగతి. చంద్రబాబును ఓడించాలనే ప్రయత్నాన్ని మాత్రం జగన్ సిన్సియర్‌గా చేస్తున్నారు. తను మాట్లేడట‌ప్పుడు ఎక్కడా రెచ్చిపోకుండా చాలా కూల్‌గా ఉంటారు. జగన్ మాటలు విని ప్రత్యర్థులు రెచ్చిపోవాల్సిందే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ జగన్ పద్ధ‌తి ఒకేలాగుంది. నిజానికి తన మాటలతో జనాలను ఆకర్షించేత, మైమరిపించేంత వక్త కాదు జగన్. కానీ చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా, సుత్తి లేకుండా చెప్పగలగటమే జగన్ ప్లస్ పాయింట్.

ఇదే సమయంలో పవన్ కల్యాణ్ విషయం తీసుకుంటే తానేం చెబుతున్నారో తనకే తెలియ‌దు. ఒక సబ్జెక్టు మొదలుపెట్టి సంబంధంలేని ఏవోవో సబ్జెక్టుల్లోకి వెళిపోతుంటారు. అసలు పవన్ ఏ విషయం మీద మాట్లాడుతున్నారో కూడా జనాలకు అర్థంకాదు. సడెన్‌గా పూనకం వచ్చినవాడిలా ఊగిపోతుంటారు. పిచ్చిపిచ్చిగా అరవటం, కేకలు వేయటం, ఉన్మాదిలాగ చేతులు, కాళ్ళని ఊపేస్తుంటారు. నోటికేదొస్తే అది మాట్లాడేస్తుంటారు. మొత్తం మీద తాను కన్ఫ్యూజ్ అయి జనాలనూ కన్ఫ్యూజ్ చేసేస్తుంటారు.

స్పృహలో ఉన్నవారెవరు ముఖ్యమంత్రిని పట్టుకుని నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత అని అడుగుతారా? రెండు చోట్ల పోటీ చేసి రెండుచోట్లా ఓడిపోయిన పవన్, 175 సీట్లలో పోటీ చేసి 151 సీట్లను గెలుచుకుని సీఎం అయిన జగన్‌ను పట్టుకుని నీ స్థాయి ఎంత‌? నీ బతుకెంత? నువ్వెంత? అని అడుగుతున్నారంటే అది ఉన్మాదస్థితిలో మాట్లాడటం వల్లే. జనాలను మాటలతో మంత్రముగ్దులను చేసేంత సీన్ పవన్‌కూ లేదు. మొన్నటి తాడేపల్లిగూడెం బహిరంగసభ తర్వాత జగన్ – పవన్ మధ్య పోలికపై చర్చ పెరిగిపోతోంది.

RELATED ARTICLES

Most Popular