ఎన్నికలు దగ్గరపడుతుండటంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాస్త స్పీడు పెంచాడు. గతంలో యువగళం నిర్వహించారు. కానీ ఆ యువగళం ప్లాప్ కావడంతో గత పది రోజులుగా ఉత్తరాంధ్రలో శంఖారావం సభల్లో పాల్గొంటున్నారు. తన ఉత్తరాంధ్ర పర్యటనలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై మాట్లాడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కును కొనుగోలు చేస్తామని హామీ ఇస్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్రంపై మాట్లాడడం లేదని విమర్శిస్తున్నారు. ఇక్కడే నారా లోకేష్ తన అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారు.
బీజేపీని, కేంద్రాన్ని వ్యతిరేకించే దమ్ము నారా లోకేష్‌కు ఏ మాత్రం లేదని దాన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ జగన్‌పై విమర్శలు చేస్తున్న లోకేష్..కేంద్రాన్ని తప్పు పట్టడం లేదు? ప్రైవేటీకరణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామని కూడా ఆయన స్పష్టంగా చెప్పడం లేదు. టీడీపీ ప్రస్తుతం బీజేపీతో పొత్తు పెట్టుకుంటోంది. ఇలాంటి సమయంలో ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించలేరు. అందుకే.. బీజేపీని మాట అనుకుండా.. తప్పంతా జగన్‌పై తోసేస్తూ నిందలు వేస్తున్నారు. అసలు చేసిందంతా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అయితే.. జగన్ మీద ఏడుపు ఎందుకో అర్థం కావడం లేదు.
విశాఖ ఉక్కు గురించి మాట్లాడుతున్న నారా లోకేష్ విశాఖ రైల్వే జోన్ గురించి గానీ విశాఖ మెట్రో రైలు గురించి గానీ ఎందుకు మాట్లాడడం లేదు. ఈ రెండు అంశాలపై కేంద్రాన్ని ఎందుకు విమర్శించడం లేదు. ఆ దమ్ము లోకేష్‌కి ఉందా..? కేంద్రాన్ని ఎదురించే దమ్ములేదు కాబట్టే.. లోకేష్ మాటలకు కూడా విలువ లేకుండా పోతోంది.