Homeఆంధ్రప్రదేశ్నారా లోకేష్ బుజ్జగింపుతో మెత్తబడ్డ జలీల్ ఖాన్ !

నారా లోకేష్ బుజ్జగింపుతో మెత్తబడ్డ జలీల్ ఖాన్ !

టీడీపీ నేత, మైనారిటీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జలీల్ఖాన్ విజయవాడ పశ్చిమ నియోజవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన ఆయనకు మిత్రపక్షం కారణంగా ఈ దఫా టికెట్ దక్కలేదు. అయితే.. ఇలా టికెట్ దక్కనివారిని వైసీపీ గాలికివదిలేసినట్టుగా టీడీపీ వదిలేయలేదు. తాజాగా నారా లోకేష్ జలీల్ ఖాన్ను బుజ్జగించారు. అంతేకాదు పార్టీని గెలిపించాలని మైనారిటీలను ఏకం చేయాలని విజయవాడ పశ్చిమలో కలిసి మెలిసి పనిచేయాలని సూచించారు.ఇక, పార్టీ అధికారంలోకివచ్చిన తర్వాత ఎమ్మెల్సీ సీటును ఇవ్వడంతోపాటు మంత్రి పదవిని లేదా వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవిని ఐదేళ్లపాటు ఇస్తామని ఇది కూడా కుదరకపోతే మైనారిటీ సంక్షేమ కార్పొరేషన్కు చైర్మన్ను చేస్తామని నారా లోకేష్ చంద్రబాబు మాటగా చెప్పినట్టు ఎన్టీఆర్ భవన్ వర్గాలు చెబుతున్నాయి.


దీనికి ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తనకు టికెట్ ఇవ్వకపోతే.. మైనారిటీలు ఉరేసుకుంటారని కొన్నాళ్లు జలీల్ బెట్టు చేశారు. తనకు ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు.త నకు ఎవరూ టికెట్ ఇవ్వకపోయినా పోటీ మాత్రం తప్పదని చెప్పారు. తనతో వైసీపీ కీలక నాయకులు.. భేటీ అయ్యారని పార్టీలోకి ఆహ్వానించారని వెల్లడించారు. పశ్చిమలో తనకు తప్ప ఎవరికీ పోటీ చేసే అర్హత, అవకాశం కూడా లేదని చెప్పుకొచ్చారు.జలీల్ ఖాన్ అధినేత చంద్రబాబు సూచనలతో మెత్తబడడం గమనార్హం. సుమారు 2.7 లక్షలు ఉన్న పశ్చిమ ఓట్లను ప్రభావితం చేయగల నాయకుడు కావడంతో ఇప్పుడు పశ్చిమలో మిత్రపక్షం గెలుపు నల్లేరుపై నడకేనన్నది పరిశీలకుల అంచనా.

RELATED ARTICLES

Most Popular