Homeఅంతర్జాతీయంMaruti price hike | వాహనదారులకు షాక్‌..! మళ్లీ ధరలు పెంచబోతున్న మారుతి సుజుకీ..!

Maruti price hike | వాహనదారులకు షాక్‌..! మళ్లీ ధరలు పెంచబోతున్న మారుతి సుజుకీ..!

ఇటీవలకాలంలో భారత్‌లో ఆటోమొబైల్‌ రంగం దూసుకెళ్తున్నది. డిమాండ్‌ నేపథ్యంలో కంపెనీలు సైతం వాహనాల ధరలను పెంచుతున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా జపాన్‌కు చెందిన మారుతీ సుజుకీ కంపెనీ సైతం మరోసారి కార్ల ధరలను పెంచేందుకు సిద్ధమైంది. కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (కార్పొరేట్​ అఫైర్స్​) రాహుల్​ భార్తి సైతం ధరలను పెంచబోతున్నట్లుగా సంకేతాలిచ్చారు.

అయితే, ముడి సరుకు ధరలు, ఉత్పత్తి వ్యయం పెరుగుతున్నది.. దాంతో ధరలను పెంచాల్సి వస్తుందని చెప్పారు. దీనికి తోడు ఎర్రసముద్రంలో సంక్షోభం కారణంగా ఉత్పత్తికి ఆటంకాలు ఎదురవుతున్నాయని.. ఈ క్రమంలో ధరలను పెంచబోతున్నట్లుగా వెల్లడించారు. ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య గతేడాది యుద్ధం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఎర్రసముద్రం ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి.

పలు కంటైనర్‌ షిప్‌లపై మిలిటెంట్లు దాడికి పాల్పడుతున్నారు. దాంతో సరఫరా గొలుసుకి ఆటంకం కలుగుతున్నది. ఇటీవల ఆడీ ఇండియా సైతం ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేయగా.. తాజాగా మారుతీ సైతం ఇదే విషయంపై స్పందించింది. సముద్రంలో సంక్షోభం నేపథ్యంలో లాజిస్టిక్స్‌ పరంగా సవాళ్లు ఎదురవుతున్నాయని.. రిస్క్‌ కారణంగా ఖర్చులు పెరగవచ్చని రాహుల భార్తి పేర్కొన్నారు. కంటైనర్‌ షిప్‌ల రాకపోకలకు సంబంధించి సమస్యలు ఎదురవ్వొచ్చని.. పిక్‌ చేసుకోవడంలో అనిశ్చిత ఉండవచ్చన్నారు.

ప్రస్తుతం పరిస్థితి సాధారణంగా ఉందని.. ఇంకా తీవ్రంగా పెరగలేదనన్నారు. భారత్‌లోనే అతిపెద్ద ఆటోమొబైల్‌ కంపెనీగా మారుతీ సుజుకీ కొనసాగుతున్నది. ప్యాసింజర్‌ వాహనాల ఎగుమతుల్లోనూ కంపెనీ హవా కొనసాగుతున్నది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 2.7లక్షల మేడ్​ ఇన్​ ఇండియా ప్యాసింజర్​ వాహనాలను ఎగుమతి చేసింది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందనే అంచనాలున్నాయి. ఇటీవల భారత్‌లో ఎలక్ట్రికల్‌ వాహనాలకు డిమాండ్‌ కనిపిస్తుండగా.. ఈ సెగ్మెంట్‌లో మారుతి ఇప్పటి వరకు ఒక్కమోడల్‌ను తీసుకురాలేదు. త్వరలోనే ఈ లోటును అధిగమించనున్నది. ప్రస్తుతం మారుతి ఈవీఎక్స్‌ పేరిట ఓ ఎలక్ట్రికల్‌ కారును తయారు చేస్తున్నది. తాజాగా జరిగిన ఎనలిస్ట్​ కాల్​లో ఈవీపై రాహుల్ భార్తి కీలక వివరాలు వెల్లడించారు. ఈవీఎక్స్​ ఎలక్ట్రిక్​ ఎస్‌యూవీ ఉత్పత్తిని ప్రారంభించేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుతున్నాయన్నారు.

ఈవీఎక్స్​ ఎలక్ట్రిక్​ కారును జపాన్​తో పాటు యూరోప్‌కు ఎగుమతి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. కొత్త ఈవీఎక్స్‌ ఎస్‌యూవీ ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న సుజుకీ గ్రాండ్ విటారా కన్నా పెద్దగా ఉంటుందని.. రేంజ్‌ 550 కిలోమీటర్లుగా ఉండవచ్చని తెలుస్తున్నది. కంపెనీ తీసుకురాబోయే ఈవీ వినియోగదారుల మనసు గెలుచుకుంటుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.

RELATED ARTICLES

Most Popular