Homeక్రీడలుఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకున్న భార‌త్.. రెండో టెస్ట్‌లో గ్రాండ్ విక్ట‌రీ

ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకున్న భార‌త్.. రెండో టెస్ట్‌లో గ్రాండ్ విక్ట‌రీ

ప్ర‌స్తుతం ఇండియా, ఇంగ్లండ్ మ‌ధ్య ఇంట్రెస్టింగ్ టెస్ట్ పోరు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. తొలి టెస్ట్ హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌గా, ఈ మ్యాచ్‌లో భార‌త్ త‌క్కువ ప‌రుగుల‌తో ఓటమి పాలైంది. ఇక ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకునే క్ర‌మంలో విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జ‌రిగిన రెండో టెస్ట్‌లో భార‌త్ 106 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. రెండో టెస్టు నాలుగో రోజు భారత జట్టులో రవిచంద్రన్ అశ్విన్ పునరాగమనం చేశాడు. మూడో రోజు ఆట ముగిసే వరకు ఇంగ్లండ్‌ తరపున 1 వికెట్‌ తీసిన అశ్విన్‌.. రెండో రోజు ఆరంభంలోనే 2 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను వెన్నుపోటు పొడిచాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ మెరుపు క్యాచ్‌తో పాటు శ్రేయాస్ అయ్య‌ర్ త్రో హైలైట్ అని చెప్పాలి.

రోహిత్ అర సెకను కంటే తక్కువ సమయంకే క్యాచ్ అందుకొని పోప్‌ని పెవిలీయన్ బాట ప‌ట్టించాడు. మరోవైపు స్టోక్స్‌ను రనౌట్ చేసిన అనంతరం శ్రేయస్ అయ్యర్ రివెంజ్ తీర్చుకుంటూ సెలబ్రేషన్స్‌ చేసుకున్నాడు. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో శ్రేయస్ ఆడిన షాట్‌ను స్టోక్స్ గొప్పగా డైవ్ చేస్తూ క్యాచ్‌ను అందుకోగా, ఆ స‌మ‌యంలో భారత అభిమానులకు వేలు చూపిస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఇప్పుడు దానికి ప్రతీకారంగా శ్రేయస్.. స్టోక్స్ ని ర‌నౌట్ చేసి అదే త‌ర‌హాలో సెలబ్రేష‌న్స్ జ‌రుపుకున్నాడు.

399 పరుగుల లక్ష్యంతో ఇంగ్లండ్ ఓవర్‌నైట్ స్కోరు 67/1తో ఇవాళ ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌కు భార‌త బౌల‌ర్స్ చుక్క‌లు చూపించారు. అక్ష‌ర్ వేసిన అద్భుత‌మైన బంతికి నైట్ వాచ్‌మెన్‌గా వ‌చ్చిన రెహ‌న్ అహ్మ‌ద్(23) కి ఔట‌య్యాడు. ఈ మ్యాచ్ లో జాక్ క్రాలీ వరుసగా రెండో హాఫ్ సెంచరీ సాధించారు. ఇక‌ రెండో టెస్టు నాలుగో రోజైన సోమవారం తొలి సెషన్ లో ఇంగ్లండ్ కు 6 కీలక వికెట్లు పడగొట్టి భారత్ మ్యాచ్ పై ఆధిపత్యం ప్రదర్శించింది. లంచ్ బ్రేక్ త‌ర్వాత కూడా బౌల‌ర్లు రాణించ‌డంతో ఇంగ్లాండ్ పై అద్భుత విజ‌యం సాధించింది సిరీస్ 1-1కి స‌మం చేసింది. భార‌త బౌల‌ర్స్‌లో బుమ్రా, అశ్విన్ చెరో మూడు వికెట్స్ద‌క్కించుకోగా, అక్ష‌ర్, ముకేష్‌, కుల్దీప్ ల‌కి చెరో వికెట్ ద‌క్కింది.

ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్ డ‌బుల్ సెంచ‌రీ చేసి స‌త్తా చాటిన విష‌యం తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్స్ క్రాలీ (73), ఫోక్స్ (36), హార్ట్‌లీ(36) కాసేపు భార‌త్ బౌల‌ర్స్‌ని పరీక్షించారు. చివ‌రికి ఇండియ‌న్ బౌల‌ర్స్ విజ‌యం సాధించారు. ఇక ర‌విచంద్ర‌న్ అశ్విన్ త‌న 500వ వికెట్‌కి ఎంత‌గానో ప్ర‌య‌త్నించ‌గా, 499 ద‌గ్గ‌ర ఆగిపోయాడు. మూడో టెస్ట్‌లో ఆ మార్క్ చేరుకోనున్నాడు. కాగా ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 396 ప‌రుగులు చేయ‌గా, ఇంగ్లండ్ 253 ప‌రుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో ఇండియా 255 ప‌రుగులకి ఆలౌట్ కాగా, ఇంగ్లండ్ 292 ప‌రుగులు మాత్ర‌మే చేసింది.

RELATED ARTICLES

Most Popular